- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రష్మికతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యా.. యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల జోరులో ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల.. నేషనల్ క్రష్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ముందుగా రాబిన్ హుడ్ సినిమాలో రష్మికనే తీసుకోవాలని అనుకున్నారు. ఆమెతో కొన్ని సీన్లు షూట్ చేసిన తర్వాత ఆమె ప్లేస్‌లో నన్ను తీసుకున్నారు. ఆ టైమ్‌లోనే పుష్ప-2 ఐటెం సాంగ్ చేస్తున్నాము.
అప్పుడు రష్మికతో మాట్లాడాలి అంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ డేట్స్ కుదరక రష్మికనే రాబిన్ హుడ్ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత నేను రష్మిక మంచి ఫ్రెండ్స్ అయ్యాము. రాబిన్ హుడ్ మూవీలో నా క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీలీల చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
READ MORE ...
బ్లాక్ డ్రెస్‌లో కేక పుట్టిస్తున్న హీరోయిన్.. నీ హస్బెండ్ ఎక్కడా అంటూ నెటిజన్ల కామెంట్స్