అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు.. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం

by Ramesh Goud |
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు.. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో శనివారం వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) బీసీ రిజర్వేషన్ల బిల్లును (BC Reservations Bill) సభలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నది. దీని కోసం అన్నీ ఏర్పాట్లు చేసింది. బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచే బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (BC Minister Ponnam Prabhakar) శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు (Congress BC MLAs) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేందుకు అన్నీ పార్టీ మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ (Konda Surekha) లతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్ (Whip Adi Srinivas), బీర్ల ఐలయ్య (Beerla Ailaiah), ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి (Vakiti Srihari), ప్రకాష్ గౌడ్ (Prakash Goud), ఈర్లపల్లి శంకరయ్య (Eerlapalli Shankaraih), మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ (Makkan Sing Raj Thakur) లు పాల్గొన్నారు. నేడు శాసన సభలో ప్రవేశ పెట్టనున్న బీసీలకు రిజర్వేషన్లు పెంచే బిల్లుపై చర్చ సజావుగా సాగేలా చూడాలని, దీని కోసం అన్ని పార్టీల మద్దతు కూడగట్టేలా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. దేశంలో మొదటి సారి చారిత్రాత్మక బీసీ రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు ఆమోదం పొందిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలను కలిసి రిజర్వేషన్ల పెంపు మద్దతు కోరాలని సమావేశంలో చర్చించారు.

Next Story

Most Viewed