- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మణిపూర్‌లో మరోసారి కాల్పులు..జార్ఖండ్ వాసి మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్లు ఆగడం లేదు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ముగ్గురు కూలీలపై తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగపడ్డారు. దీంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ జిల్లాలోని నౌరెమ్‌థాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుడిని జార్ఖండ్‌కు చెందిన శ్రీరామ్ హంగ్‌సదా(41)గా గుర్తించారు. క్షతగాత్రులైన మిగతా ఇద్దరు కూడా జార్ఖండ్ వాసులేనని వారు స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. వారు ప్రస్తుతం ఇంఫాల్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కాల్పులు జరపడానికి గల కారణాలు, కాల్పులకు తెగపడ్డ నిందితుల వివరాలు వెల్లడించలేదు. దీంతో హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రాంతంలో భారీగా భద్రతను మోహరించారు. కాగా, మణిపూర్‌లో ఏడాది కాలంగా కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 200 మందికి పైగా మరణించారు. మరో 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.