- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటుడు, బీజేపీ అభ్యర్థి రవికిషన్ డీఎన్‌ఏ టెస్ట్ పిటిషన్‌ను తిరస్కరించిన ముంబై కోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ గోరఖ్‌పూర్ అభ్యర్థి, నటుడు రవి కిషన్‌కు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని కోరుతూ 25 ఏళ్ల యువతి చేసిన అభ్యర్థనను ముంబై కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రవికిషన్ తన తండ్రి అని జూనియర్ నటి షినోవా సోనీ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలోనే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారం క్రితం రవి కిషన్ తన భర్తి అని షినోవా తల్లి అపర్ణా సోనీ లక్నోలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ తర్వాత ఆమె కుమార్తె డీఎన్ఏ టెస్ట్ చేయాలని కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌పై చివారణ సందర్భంగా, రవి కిషన్‌ను తాను అంకుల్ అని పిలుస్తున్నప్పటికీ, నిజానికి ఆయన తన తండ్రి అని షినోవా సోనీ తెలిపారు. అయితే, రవి కిషన్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది.. తన క్లయింట్‌కు, అపరణాకు ఎటువంటి సంబంధం లేదని, వారిద్దరికీ గతంలో పరిచయం ఉన్నప్పటికీ, అది స్నేహమేనని వాదించారు. ఈ క్రమంలో ముంబైలోని సెషన్స్ కోర్టు అపర్ణా సోనీ, రవి కిషన్ మధ్య సంబంధం ఉన్నట్లు ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. కాబట్టి డీఎన్ఏ టెస్ట్ అవసరం లేదని ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, ఇదే వ్యవహారానికి సంబంధించి రవి కిషన్ భార్య ప్రీతి మాట్లాడుతూ.. గతేడాది షినోవాతో పాటు ఆమె తల్లి అపరణా తమకు రూ. 20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే అత్యాచారం కేసులో ఇరికిస్తామని బెదిరించినట్టు ఆరోపించారు.