- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్....
దిశ, మహబూబాబాద్ టౌన్ : జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా పరిషత్ హై స్కూల్, అంగన్వాడీ కేంద్రం, జామండ్లపల్లి, ఆశ్రమ హై స్కూల్ బాలికలు, ముత్యాలమ్మగూడెం, టీజీ డబ్ల్యూ ఆర్ఇఐఈఎస్, లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ వారికి అందుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు, పరిసరాలు, స్టోర్స్, వంట గదులను స్వయంగా తనిఖీ చేశారు* పిల్లలకు స్వచ్ఛమైన, రుచికరమైన ఆహారం అందించాలని ఆహారం వన్డే సిబ్బంది పరిశుభ్రంగా చేతులు కడుక్కొని ఆహార పదార్థాలను సిద్ధం చేయాలన్నారు.
స్వచ్ఛమైన త్రాగు నీరు అందించాలని, నిరంతరం విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, ప్రతి విద్యార్థినీ, విద్యార్థుల వ్యక్తిగత, పరిశుభ్రత, మానసిక వికాసం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని గమనిస్తూ అవగాహన కల్పించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి సబ్జెక్టు పై ఎలాంటి సందేహాలు ఉన్న సమాధానాలు చెబుతూ విద్య బోధనలు అందించాలని సూచించారు. వసతి గృహాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వార్డెన్లు, ప్రిన్సిపాల్ ,ఆర్ సి ఓ లు, నిత్యం గమనిస్తూ ఉండాలని, ప్రత్యేక అధికారులు కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కురవి మండల ప్రత్యేక అధికారి నరసింహస్వామి, కేజీ విబి, మోడల్ హై స్కూల్ నేరెడ, డోర్నకల్ ప్రత్యేక అధికారి నరసింహమూర్తి, డోర్నకల్లో వసతి గృహాలను పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రత్యేక అధికారులు వసతి గృహాల నిర్వహణపై నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వ సూచనల ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.