VRS: ఈ పదేళ్లలో 853 మంది ఐఆర్ఎస్ అధికారుల వీఅర్ఎస్: కేంద్రం

by Prasad Jukanti |
VRS: ఈ పదేళ్లలో  853 మంది ఐఆర్ఎస్ అధికారుల వీఅర్ఎస్: కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2014 నుంచి 2024 వరకు ఈ దశాబ్ద కాలంలో 853 మంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారులు వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) వెల్లడించారు. సోమవారం లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన 383 మంది ఐఆర్ఎస్ (ఆదాయ పన్ను) అధికారులు, 470 ఐఆర్ఎస్ (కస్టమ్స్, పరోక్ష పన్నులు) అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. 2020 ఆర్థిక సవంత్సరం నుంచి 2025 (అక్టోబర్ 31, 2024 వరకు) ఆర్థిక సంవత్సరం వరకు కేరళలోని విమానాశ్రయాల్లో 2,746.49 కిలోల బంగారాన్ని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్, డిఆర్‌ఐ స్వాధీనం చేసుకున్నారని మంత్రి ప్రత్యేక సమాధానంలో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed