సైబర్ కొత్త తరహా మోసం…జాగ్రత్త పడకపోతే చిల్లే..

by Aamani |   ( Updated:2021-04-29 05:13:08.0  )
సైబర్ కొత్త తరహా మోసం…జాగ్రత్త పడకపోతే చిల్లే..
X

దిశ,బోథ్ : సోషల్ మీడియాలో ఆన్లైన్ మోసం కొత్త తరహా నడుస్తుంది. సోషల్ మీడియాలల్లో జనాలు ఎక్కువగా యూజ్ చెసే దాంట్లో ఫేస్ బుక్ ఒకటి. ఈ మధ్య ఫేస్‌బుక్‌‌ అకౌంట్‌లు హాక్ చేసి కొందరిని బురిడి కొట్టిస్తున్నారు. అత్యావసరంగా డబ్బు అవసరం ఉంది అని 2000 నుండి 10000 వరకు అడుగుతున్నారు. కొందరు ముందే ఫేక్‌అకౌంట్ అని రిపొట్ కొడుతున్నారు. కొందరు మాత్రం అవసరం ఉన్నది అని పంపించి మోసపోతున్నారు.

బతికి ఉన్నోల్లు అడుగుతే పర్లేదు కానీ చనిపోయిన వారు కూడా అడిగేది విచిత్రం కలిగిస్తుంది. అదేంటి… అనుకుంటున్నారా.. బోథ్‌కి చెందిన చట్ల నరేష్ అనే వ్యక్తి తెరాసా మండల కార్యదర్శిగా చురుకుగా పని చేశాడు. ఇతను సెప్టెంబర్ 26,2017 నాడు పోచెర జలపాతం లో పడి చనిపోయాడు. అతను చనిపోయినా అతని ఫేస్‌బుక్ అకౌంట్‌ను మాత్రం మోసగాళ్ళు వదలడం లేదు. అతని అకౌంట్‌ను హాక్ చేసి డబ్బులు అడుగుతూ..మరో నయా మోసానికి తెరలేపారు. ఇకనైన సోషల్ మీడియా వాడే వారు జాగ్రత్తగా ఉండండి సుమా…!!

Advertisement

Next Story