పాకిస్తాన్‌లో సోషల్ మీడియా బ్యాన్

by vinod kumar |
పాకిస్తాన్‌లో సోషల్ మీడియా బ్యాన్
X

ఇస్లామాబాద్: సోషల్ మీడియా వేదికలు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సహా అన్నింటిని పాకిస్తాన్ బ్యాన్ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిషేధం అమలు చేసింది. ఇస్లామిస్ట్‌ల ఆందోళనలను కట్టడి చేయడానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ర్యాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ తెహ్రీక్ ఈ లబ్బాయిక్ పాకిస్తాన్ నేతను అరెస్టు చేసినప్పటి నుంచి పాక్‌లో ఆందోళనలు చెలరేగాయి. ఇప్పటికీ తీవ్రంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఈ నిరసనలు ఉధృతమయ్యే ప్రమాదముందని, వారు సమన్వయం కాకుండా నియంత్రించే చర్యల్లో భాగంగా సోషల్ మీడియా బ్యాన్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎంచుకుంది. అయినప్పటికీ కొందరు యూజర్లు వీపీఎన్‌ను వినియోగించుకుని ట్విట్టర్‌లో ట్వీట్లు చేశారు.

Advertisement

Next Story