స్నిఫర్ డాగ్‌కు స్పెషల్ సెండాఫ్ ఇచ్చిన నాసిక్ పోలీస్

by Anukaran |   ( Updated:2021-02-27 05:37:51.0  )
స్నిఫర్ డాగ్‌కు స్పెషల్ సెండాఫ్ ఇచ్చిన నాసిక్ పోలీస్
X

దిశ, ఫీచర్స్: నేర పరిశోధనతో పాటు క్రిమినల్స్‌ను పట్టుకోవడంలో పోలీసులకు ‘జాగిలాల’ హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అవి ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తుంటాయి. అలాంటి ఓ శునకం జ్ఞాపకార్థం.. ఇటీవలే యూపీలోని ముజఫర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో దాని విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

తాజాగా మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు సర్వీస్ పూర్తి చేసుకున్న జాగిలానికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఆ వీడియోను మీడియా సంస్థ ఏఎన్ఐ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు పోలీసులను ప్రశంసిస్తున్నారు. మహారాష్ట్ర, నాసిక్ పోలీస్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ మెంబర్ అయిన స్నిఫర్ డాగ్ ‘స్పైక్’.. నాసిక్ సిటీ పోలీస్ ఫోర్స్‌లో 11 ఏళ్ల పాటు విధులు నిర్వహించింది. కాగా ‘స్పైక్’ సర్వీస్‌లో చివరి రోజున సిటీ పోలీసులు దానికి స్పెషల్‌గా సెండాఫ్ ఇచ్చారు. ‘స్పైక్’ మెడలో పూల మాల వేసి, పూలతో ప్రత్యేకంగా అలంకరించిన పోలీస్ జీప్‌లో స్టేషన్ ప్రాంగణమంతా తిప్పి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ ‘స్పైక్’కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

Advertisement

Next Story