- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టిన స్నాప్‌చాట్!
లాక్‌డౌన్ కారణంగా చాలా మంది మానసిక స్థితిలో మార్పులొచ్చాయి. ఒంటరిగా ఉండటం వల్ల లేనిపోని సమస్యల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నారు. ఇక అతిగా ఆలోచించే అలవాటున్నవాళ్లయితే డిప్రెషన్‌కు గురవుతున్నారు. మొన్నటికి మొన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డిప్రెషన్‌లో లోపల ఉన్న బాధను వేరొకరితో చెప్పుకోవాలనిపిస్తుంది. అయితే వాట్సాప్, మెసెంజర్ ద్వారా బాధను పంచుకోవాలంటే ఎవరన్నా చూస్తారేమోనని కొద్దిగా భయం ఉంటుంది లేదా అవే మెసేజ్‌లను తర్వాత చదువుకుని ఇంకా ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో స్నాప్‌చాట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మెసేజ్‌లు సేవ్ కావు కాబట్టి ఎక్కువ మంది దీన్ని వాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఫీచర్ల మీద స్నాప్‌చాట్ శ్రద్ధ వహిస్తోంది. ఇప్పటికే అందులో ‘హెడ్‌స్పేస్’ పేరుతో ధ్యానానికి సంబంధించిన ఫీచర్‌ను అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా ‘కోచ్ కెవ్’ పేరుతో కమెడియన్ కెవిన్ హార్ట్ తన జీవిత అనుభవాలను పంచుకునే స్నాప్ ఒరిజినల్ కూడా ఉంది. గతంలో స్నాప్‌చాట్ పెట్టిన ‘మైండ్ యువర్‌సెల్ఫ్’ అనే డాక్యు-సిరీస్‌ను 12 మిలియన్ల మంది వీక్షించారు. ఇందులో పూర్తిగా టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలే ఉన్నాయి. అందుకే మానసిక ఆరోగ్యం మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించడం వల్ల తమ వినియోగదారులకు కష్టసమయాల్లో కావాల్సిన సాయాన్ని అందించే అవకాశం కలుగుతుందని స్నాప్ వీపీ జాకోబ్ యాండ్రూ అన్నారు. వీటితో పాటు ఆత్మహత్య ప్రాబల్యత ఉన్న వినియోగదారులు తమ పరిస్థితిని ముందే తమ స్నేహితులకు తెలియజేయగల ఫీచర్‌ను కూడా స్నాప్‌చాట్ ప్రవేశపెట్టబోతున్నట్లు జాకోబ్ వెల్లడించారు.