అటవీ రేంజ్ అధికారులపై స్మగ్లర్ల దాడి

by Aamani |

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజ్ పరిధిలో కొందరు స్మగ్లర్లు ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడికి పాల్పడ్డారు. ఆదివారం ఖానాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో విలువైన కలప తరలిస్తున్నారన్న సమాచారం మేరకు అటవీ రేంజ్ అధికారి వినాయక్, బీట్ అధికారి పృథ్వీ రాజ్‌లు ఘటనా స్థలికి చేరుకున్నారు. వారి రాకను గమనించిన స్మగ్లర్లు వెంటనే అధికారులపై దాడికి దిగారు. వారు అప్రమత్తమయ్యేలోపే కలప దుంగలను అక్కడే వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. గాయపడిన అధికారులను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, స్మగ్లర్లను పాత ఎల్లాపూర్ వాసులుగా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.

tags: smugglers attack forest range officer, adilabad, wood smuggling

Advertisement

Next Story

Most Viewed