కోహ్లీతో పోటీ వాస్తవమే: స్మిత్

by Shyam |
కోహ్లీతో పోటీ వాస్తవమే: స్మిత్
X

దిశ, స్పోర్ట్స్: తనకూ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య పోటీ ఉందన్న మాట వాస్తవమేననీ, అయితే అది కేవలం ఆట పరంగానేననీ, వ్యక్తిగతంగా కాదని ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. కోహ్లీ అంటే చాలా గౌరవమని చెప్పాడు. మంగళవారం స్మిత్ పుట్టిన రోజు సందర్భంగా ఓ టీవీ కార్యక్రమంలో తన కెరీర్, ఇతర ఆటగాళ్ల గురించి చర్చించాడు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టాప్ బ్యాట్స్‌మాన్‌గా పేరొందిన స్మిత్, కొహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయని పలు వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో వాటన్నింటికీ స్మిత్ ఫుల్‌స్టాప్ పెడుతూ.. తనకు కోహ్లీ అన్నా, అతని ఆటన్నా ఎంతో ఇష్టమని వెల్లడించాడు. కోహ్లీ గురించి కామెంట్ చేయాలని ఎవరు అడిగినా ఒక్క చెడు పదం కూడా వాడనని అన్నాడు. భారత క్రికెట్ కోసం కోహ్లీ ఎంతో చేశాడనీ, పలు రికార్డులను తిరగరాశాడని ప్రశంసించాడు. కోహ్లీ ఒక నిత్య విద్యార్థి అంటూ అభివర్ణించాడు.

Advertisement

Next Story