- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేట కలెక్టర్‌కు షాక్.. కాంగ్రెస్ నేత దేవులపల్లి సంచలన వ్యాఖ్యలు
దిశ, సిద్దిపేట: రైతులకు కావాల్సిన వరి విత్తనాలు తామే అందిస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి రైతులకు భరోసా కల్పించారు. శుక్రవారం నంగునూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పూర్తిగా రైతు వ్యతిరేకి అని, అందుకే రైతులకు ప్రతిసారి ఏదో రూపంలో నష్టాన్ని కలిగిస్తున్నాడని మండిపడ్డారు. టీవీల్లో, పత్రికల్లో రైతులకు అణుకూలంగా మట్లాడుతూ.. చేతల్లో పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. యాసంగి పంటలకు వరి విత్తనాలను రైతులకు ఇవ్వొద్దని కేసీఆర్ చెప్పడమే కాకుండా, రైతులెవరూ వరి సాగుచేయొద్దని ప్రభుత్వ అధికారులతో చెప్పిస్తూ.. రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నాడని మండిపడ్డాడు.
రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేయకపోతే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మేమే వరి విత్తనాలను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పంపిణీని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు.