భారత మార్కెట్లోకి స్కోడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ కారు విడుదల

by Anukaran |   ( Updated:2020-07-15 09:38:23.0  )
భారత మార్కెట్లోకి స్కోడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ కారు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: స్కోడా ఆటో ఇండియా బుధవారం తన మిడ్-సైజ్ సెడాన్ కొత్త ర్యాపిడ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్కోడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ పేరుతో విడుదల చేసిన ఈ కార్ ధర రూ. 7.99 లక్షలుగా నిర్ణయించింది. కేంద్రం తీసుకొచ్చిన కాలుష్య ఉద్గార నిబంధనల ప్రకారం బీఎస్6 అనుగుణంగా దీన్ని రూపొందించారు. అలాగే, ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 10 పీఎస్ పవర్ ఇవ్వనుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యుయెల్ ఎయిర్ బ్యాగ్, ఫ్లోటింగ్ కోడ్ సిస్టమ్‌తో ఈ ఇంజిన్ పనిచేయనుంది. రియర్ పార్కింగ్ సెన్సార్లు, రఫ్ రోడ్ ప్యాకేజ్ లాంటి అధునాతన, రక్షణాత్మక ఫీచర్లను ఇందులో అందిస్తోంది. అంతేకాకుండా 16.51 సెంటీమీటర్ల కలర్ టచ్ స్క్రీన్, డస్ట్-పొల్యుషన్ ఫిల్టర్ లాంటి ఇతర సేఫ్టీ ఫీచర్లను ఇందులో అందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. ‘వాహనదారులకు పోటీ ధరలో క్లాస్ అండ్ సేఫ్టీ ఫీచర్లతో రైడర్ ప్లస్ వేరియండ్ కారును తీసుకొచ్చామని, సున్నితమైన ఇంటీరియర్స్, ఆకట్టుకునే డిజైన్‌తో విశాలమైన సిటింగ్ కెపాసిటీని ఇందులో అందిస్తున్నట్టు స్కోడా ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story