- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊహించని షాక్
దిశ ఏపీ బ్యూరో: ఏపీఎస్ ఆర్టీసీ.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. కరోనా కష్ట కాలంలో ఎవరి ఉద్యోగాలు తొలగించవద్దని సుద్దులు చెప్పే ప్రభుత్వం.. చివరికి చెప్పేది ఒక్కటి.. చేసేది మరొక్కటిలా ఉంది ప్రభుత్వ తీరు. అసలు విషయం ఏంటంటే.. ఆర్టీసీలో ఏళ్లుగా పని చేస్తున్న 6 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు వేసి షాక్ ఇచ్చింది. ఈ రోజు నుంచి విధులకు హాజరు కావద్దంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో డిపో మేనేజర్లు పేర్కొన్నారు.
కాగా, ఏప్రిల్ నెల జీతాలు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇంత వరకు ఇవ్వలేదు. ఆర్టీసీ నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఆర్టీసీ యాజమాన్య తీరును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ హెచ్చరించారు.