న్యూజీలాండ్ వెళ్లిన పాక్ ఆటగాళ్లకు కరోనా

by Shyam |
న్యూజీలాండ్ వెళ్లిన పాక్ ఆటగాళ్లకు కరోనా
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. పాకిస్తాన్ నుంచి న్యూజీలాండ్ వెళ్లిన జట్టు ప్రస్తుతం క్రైస్ట్‌చర్చ్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. వారికి కరోనా టెస్టు చేయగా ఆరుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు పాకిస్తాన్ క్రికెటర్లకు ఐసోలేషన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ మినహాయింపులు రద్దు చేసి అందరినీ పూర్తి ఐసోలేషన్ చేశారు. డిసెంబర్ 18 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. అంతకు ముందు న్యూజీలాండ్ పాకిస్తాన్ జట్టు న్యూజీలాండ్-ఏ జట్టుతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పుడా మ్యాచ్‌లు జరిగే అవకాశం లేనట్లు తెలుస్తున్నది. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకపోతే సిరీస్ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని న్యూజీలాండ్ క్రికెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisement

Next Story