- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థులకు షాక్..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలైన 10 మంది అభ్యర్థుల నామినేషన్లలో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బుధవారం ఎన్నికల అధికారి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో అధికారులు చంద్రారెడ్డి, వేణుగోపాల్, రఘురామ శర్మ, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వరి, పద్మశ్రీ, భాగ్యలక్ష్మి తదితరులు దాఖలైన నామినేషన్ పత్రాలను పరిశీలించారు.
తిరస్కరణకు గురైన వాటిలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్న సారా బాయి కృష్ణ, షేక్ రహీమ్ పాషా, మహమ్మద్ గౌస్, సంద రేణుక, బెజ్జం మల్లికార్జున రావు, మంతటి రామాంజనేయుల నామినేషన్లు ఉన్నాయి. మొత్తం 10 మంది అభ్యర్థుల్లో ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా, అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు కావలి శ్రీశైలం, సుధాకర్ రెడ్డిల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. తమ నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం పట్ల పలువురు స్వతంత్ర అభ్యర్థులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు.