ఆరడుగుల దూరమున్నా.. కరోనాను అడ్డుకోలేం!

by vinod kumar |
ఆరడుగుల దూరమున్నా.. కరోనాను అడ్డుకోలేం!
X

దిశ, వెబ్‌డెస్క్ :
లాక్‌డౌన్ విధించినా.. కరోనా కంట్రోల్‌లోకి రాకపోవడంతో ఇక వైరస్‌తో కలిసి జీవించాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో కరోనాను అడ్డుకునేందుకు మనకున్న ఆయుధాల్లో భౌతికదూరం పాటించడం కూడా ఒకటి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రకారం వ్యక్తికి, వ్యక్తికి మధ్య కనీసం ఆరడుగుల దూరముండాలి. కానీ, అందరూ మూడడుగుల దూరంతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే 6 అడుగుల దూరంలో నిల్చున్నా సరే కరోనాను అడ్డుకోలేమని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.

తుమ్మినా, దగ్గినా, ఆఖరికి గట్టిగా మాట్లాడినా.. వాటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని శాస్ర్తవేత్తలు ఇది వరకే తేల్చి చెప్పారు. అందుకోసం అందరూ విధిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. నికోసియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తాలిబ్ డిబౌక్, డిమిత్రిస్‌ చేసిన అధ్యయనం ప్రకారం చిన్నపాటి గాలి వీచినా లేదా 4 కిలోమీటర్ల వేగంతో చిన్నపాటి తుమ్ము వచ్చినా.. సెలైవా 5 సెకన్లలో 18 అడుగుల దూరం వరకు వ్యాపిస్తుందట. గాలిలో సెలైవా చలనం గురించి తెలుసుకోవడానికి కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఏర్పాటు చేశారు. దగ్గుతూ ఉండే వ్యక్తి చుట్టూ ఉన్న గాలి వేగాన్ని బట్టి ఆ తుంపర్లు ప్రయాణిస్తూనే ఉంటాయని తేలింది. టెంపరేచర్ కూడా సెలైవా ప్రయాణించే వేగాన్ని ప్రభావితం చేస్తుంది. ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ గాలి వేగం పెరుగుతుంది కాబట్టి.. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు తుంపర్లు కూడా మరింత వేగంగా ప్రయాణిస్తాయి. మూసి ఉన్న ప్రదేశం అంటే నాలుగు గోడల మధ్యలో అయితే ఫ్యాన్ లేదా ఏసీ గాలి దిశను బట్టి వ్యాప్తి జరుగుతుంది. ఈ అధ్యయనం ప్రకారం ఆరడుగుల దూరంలో ఉన్నా కరోనాను అడ్డుకోలేమని తేలింది.

Advertisement

Next Story

Most Viewed