నిరసన గళం..ఈ పంజాబ్ సిస్టర్స్ సాంగ్స్

by Sujitha Rachapalli |
నిరసన గళం..ఈ పంజాబ్ సిస్టర్స్ సాంగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందిన సిస్టర్స్ సిమృత, రమ్​నీక్ ఇప్పటికే తమ పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్​లో పోస్ట్​ గ్రాడ్యుయేషన్ చేసిన ఈ సిస్టర్స్ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్ధతుగా నిలుస్తూ పాటలు పాడి రైతన్నలతో శభాష్ అనిపించుకుంటున్నారు.

వ్యవసాయం రంగంలో ‘సంస్కరణల’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సర్కారు దిగిరాకుంటే దీర్ఘకాల పోరాటం చేస్తామని రైతుల సంఘాలు హెచ్చరిస్తుండగా, సమస్య పరిష్కారం దిశగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ నెల 19న తొలిసారి భేటీ కానుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వారి ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. సిమృత, రమ్‌నీక్‌ రైతు పోరాటాన్ని సపోర్ట్ చేస్తూ ‘సన్ ఢిల్లీ’, ‘నెవర్ సే డై’ అనే పాటలు రాయడంతో పాటు, వాటికి మ్యూజిక్ కంపోజ్ చేసి పాడారు. నెటిజన్లను, రైతులను ఎంతగానో ఈ పాటలు ఆకట్టుకోగా, ఆ ఇద్దరికీ సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమది కూడా రైతు కుటుంబ నేపథ్యమని, తమకు రైతు బాధలు తెలుసని వారు అంటున్నారు. తమ తల్లిదండ్రులతో పాటు, ఎంతోమంది రైతుల కష్టాలను స్వయంగా చూడటం వల్లే పాటకు లిరిక్స్ అందించామని వాళ్లు చెప్పారు. నిద్రాహారాలు మాని, కఠిన పరిస్థితుల్లో రైతుల పోరాటం చేయడం తమని కదిలించిందని, ఆ స్ఫూర్తి తమతో ఈ పాటలు పాడేలా చేసిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed