అన్నకు రాఖీ కట్టి అత్తాగారింటికి బయలుదేరిన చెల్లెలు.. అంతలోనే తీరని విషాదం..

by Sumithra |
అన్నకు రాఖీ కట్టి అత్తాగారింటికి బయలుదేరిన చెల్లెలు.. అంతలోనే తీరని విషాదం..
X

దిశ, నల్లగొండ: తన భార్యను సోదరుడి ఇంటికి తీసుకువెళ్లి, రాఖీ కట్టించిన అనంతరం స్వగ్రామానికి తిరిగివస్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు దగ్గర ఆదివారం రాత్రి జరిగింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మంజుల శివ(23) కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిని లైలా అనే యువతిని రెండునెలల క్రితం వివాహం చేసుకున్నాడు.

ఆదివారం రక్షాబంధన్ కావడంతో శివ తన భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్లి, అన్నకు రాఖీ కట్టిన తర్వాత రాత్రి సమయంలో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో తిప్పర్తి మండలం ఇండ్లూరు దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్, శివ ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకు తీవ్రగాయాలు కాగా, నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అయితే లైలా పరిస్థితి మొదటగా విషమంగానే ఉన్నా ప్రస్థుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Advertisement

Next Story