కేటీఆర్ ఇలాకాలో కలెక్టర్‌కూ తప్పని తిప్పలు.. వీడియో

by Anukaran |   ( Updated:2023-12-17 15:02:55.0  )
KTR
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలు కూసింత వర్షం కురిస్తే చాలు.. చెరువులను తలపిస్తున్నాయి. తాజాగా కురిసిన వర్షాలకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కలెక్టరేట్ ప్రాంగణం చెరువును తలపిస్తోంది.

అయితే.. ఈ భవనాన్ని జూలై నెలలో సీఎం కేసీఆర్ ప్రారంభించి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా.. ఆరోజు నుంచి ఇప్పటి వరకు(3నెలల్లో) మూడు సార్లు కలెక్టరేట్ వరద నీటిలో మునిగిపోవడం గమనార్హం. అయితే ఇలా వర్షం వస్తే.. నీరు బయటకు వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కలెక్టరేట్ వద్ద వరద నీరు భారీగా చేరడంతో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు బయటకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

దీంతో కలెక్టర్‌తో సహా ఉద్యోగులు రాత్రి నుంచి బిక్కుబిక్కుమంటూ కలెక్టరేట్ భవనంలోనే ఉండిపోగా.. స్థానికులు ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో వారిని బయటకు తీసుకువచ్చారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీం స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ వీడియోపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed