- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్లను టార్గెట్ చేస్తున్న సింగర్.. షూటింగ్ టైమ్‌లో అలా చేస్తూ
దిశ, ఫీచర్స్ : క్యాస్ట్, కలర్.. సొసైటీలో కీలకం. ఈ రెండిటిలో ఏది తక్కువైనా సరే సమాజం నరకాన్ని చూపిస్తుంది. ఆ పొజిషన్‌లో అమ్మాయి ఉందంటే.. ఇంటెన్సిటీ ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. నాకు అన్యాయం జరిగింది, ఓ పెద్దాయన నన్ను లైంగికంగా వేధించాడని న్యాయపోరాటానికి దిగితే.. పైసల కోసం, ఫేమ్ కోసం ఇలాంటి కల్లబొల్లి కబుర్లు ఎన్నైనా చెప్తారని జనం గట్టిగానే వేసుకుంటారు. ఇక అతను సొసైటీలో మెగాస్టార్ అయితే.. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటే.. బాధితురాలికి మీడియానే కాదు సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ దొరకదు. మోస్ట్ పాపులర్ సింగర్, R&B మెగాస్టార్ ఆర్ కెల్లీ విలనిజానికి బలైపోయిన బ్లాక్ గర్ల్స్ స్టోరీలోనూ ఇదే జరిగింది. కలలో కూడా ఊహించలేనంత భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డ కెల్లీ.. దాదాపు 20 ఏళ్లుగా చట్టంతో దోబూచులాడుతూ, పాప్ సాంగ్స్‌తో స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. ఫర్ ఏ చేంజ్.. ఇప్పుడవే పాటలను కటకటాల వెనక పాడుకోవాల్సిన టైమ్ వచ్చేసింది.
సంగీతంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆర్ అండ్ బీ మెగాస్టార్ ఆర్ కెల్లీ.. మ్యూజిక్ వరల్డ్‌లో రిచెస్ట్ పర్సన్‌గా కొనసాగుతున్నాడు. తన పాటలపై పిచ్చి అభిమానాన్ని ప్రదర్శించే ఫ్యాన్స్.. కెల్లీని మ్యూజిక్ గాడ్‌గా భావిస్తుంటారు. అందుకేనేమో 20 ఏళ్ల క్రితం కెల్లీపై వచ్చిన లైంగిక ఆరోపణలను సైతం ట్రాష్ అంటూ కొట్టిపడేస్తూ బాధితులను అపహాస్యం చేశారు. కెల్లీ అకృత్యాలతో నరకం అనుభవించిన మైనర్ల గోడును ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే కెల్లీని ఎదుర్కొంటే చావు తప్పదని తెలిసి కూడా రెండు దశాబ్ధాలుగా అజ్ఞాతపోరాటం చేసి చివరకు విజయం సాధించారు బాధితులు.
పురాణ జర్మనీ కథలో సంగీతాన్ని ఉపయోగించి పిల్లలను అట్రాక్ట్ చేసే మిస్టీరియస్ మ్యాన్‌గా తనను తాను ప్రకటించుకున్న ఆర్ కెల్లీ.. తన సంగీతంతో మైనర్ గర్ల్స్‌ను ట్రాప్ చేశాడు. అది కూడా నల్లజాతీయులనే టార్గెట్ చేయడం విశేషం. మాజీ టూర్ మేనేజర్‌కు లంచమిచ్చి లేట్ సింగర్ ఆలియాను 15 ఏళ్ల వయసులో బలవంతంగా పెళ్లి చేసుకున్నపుడు కెల్లీ వయసు 27 ఏళ్లు. దురదృష్టవశాత్తు ఆమె ఓ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో చనిపోగా.. మైనర్లను వెంటాడి బలవంతంగా అనుభవించే పద్ధతి మార్చుకోలేదు కెల్లీ. సొసైటీ, సిస్టమ్ తనకే సపోర్ట్ చేశాయి.
లిరిక్స్‌లో హైపర్ సెక్సువలైజ్డ్ పదాలు..
అంతేకాదు తన ను సాంగ్ లిరిక్స్, పర్‌ఫార్మెన్స్‌లలోనూ హైపర్ సెక్సువలైజ్డ్ కోరికలను పొందుపరిచే కెల్లీ.. ‘ఏజ్ ఎయింట్ నథింగ్ బట్ ఎ నంబర్’ అని ఆల్బమ్‌కు పేరు పెట్టడం ఇందులో భాగమే. కాగా 2019 ‘బాంబ్‌షెల్ డాక్యుమెంటరీ సర్వైవింగ్ విత్ ఆర్ కెల్లీ’లో వర్క్ చేసిన దాదాపు 28 మంది అమ్మాయిలను సెక్సువల్‌గా టార్చర్ చేశాడు. దీనిపై అప్పట్లో స్పందించిన కెల్లీ.. బాధితులు అందరూ కూడా తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని కథలు చెప్పాడు. జనం కూడా ఇదే నమ్మడంతో చార్ట్ టాప్ – హిట్స్ క్రియేట్ చేసి మిలియన్ డాలర్లు సంపాదించగలిగిన కెల్లీ.. అత్యంత ప్రసిద్ధ, గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకడిగా మన్ననలు అందుకుంటూ ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగాడు.
2017లో చికాగో సన్ టైమ్స్ మ్యూజిక్ జర్నలిస్ట్ జిమ్ డెరోగటిస్.. కెల్లీ అకృత్యాల గురించి మేజర్ స్టోరీ పబ్లిష్ చేయడంతో పోలీసులు అతనిపై దృష్టిసారించారు. కాగా 2019లో డాక్యుమెంటరీకి సంబంధించి హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ యాడ్ అవడంతో కెల్లీ డార్క్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అదే ఇయర్‌లో పోలీసులు తనను అరెస్ట్ చేయగా.. కెల్లీ బాధితుల సుదీర్ఘ పోరాటానికి న్యాయం జరిగింది. రాకెటరింగ్ అండ్ సెక్స్ ట్రాఫికింగ్‌లో కెల్లీని దోషిగా గుర్తించిన కోర్టు.. జైలు శిక్ష విధించింది. దీంతో కెల్లీపై విజయం సాధించిన యువతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు తామే కరెక్ట్ అని గుర్తించినందుకు థాంక్స్ చెప్తున్నారు.
– సుజిత రాచపల్లి