- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సింగరేణిలో సమ్మె షురూ
దిశ ప్రతినిధి, కరీంనగర్: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బొగ్గు గనుల సమ్మెకు జాతీయ సంఘాలతో పాటు విప్లవ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని భూగర్భ, ఉపరితల గనుల్లో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను, కార్మిక చట్టాలను కాలరాస్తున్నదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బొగ్గు గనుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలన్నారు. లాక్ డౌన్ లే ఆఫ్ లో ఉన్న కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించాలని యాజమాన్యాన్ని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ తోపాటు బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్ పాల్గొనడం విశేషం. అయితే కరోనాతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సింగరేణికి 3 రోజుల సమ్మె మరింత భారం అవుతుందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సమ్మెలో పాల్గొనవద్దని జాతీయ సంఘాల నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.