సింగరేణి కార్మికుడు దారుణహత్య.. అసలేం జరిగింది.?

by Sridhar Babu |
సింగరేణి కార్మికుడు దారుణహత్య.. అసలేం జరిగింది.?
X

దిశ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని T-2 క్వార్టర్స్‌లో నివాసముండే సింగరేణి కార్మికుడు నాగభూషణం ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పరకాల ఆస్పత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. నాగభూషణం భూపాలపల్లిలోని కేటీకే-1 గనిలో ట్రామర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాగభూషణాన్ని హత్య చేసి ఉంటారని తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి.. పూర్తి విచారణ జరిపిన తర్వాత వివరాలు తెలియజేస్తామని భూపాలపల్లి సీఐ వాసుదేవరావు తెలిపారు.

కాగా నాగభూషణాన్ని అతని కొడుకు హత్య చేసినట్లు స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. కుటుంబ సభ్యులు రాఖీ కోసం కొత్తగూడెం వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story