బెంగాల్ ఎన్నికలు: నన్ను సంప్రదించకుండా నా పేరెలా ప్రకటిస్తారు?

by Shamantha N |   ( Updated:2021-03-19 06:17:44.0  )
బెంగాల్ ఎన్నికలు: నన్ను సంప్రదించకుండా నా పేరెలా ప్రకటిస్తారు?
X

దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎన్నికల సందడే కనిపిస్తుంది. సత్తా ఉన్న అభ్యర్థులను పోటీలోకి దించి విజయం సాధించడానికి అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను రచిస్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ లో పాగా వేయడానికి బీజేపీ తో పాటు పలు పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఒక తప్పు చేసి పరాభవాన్ని చవిచూసింది. ఇప్పటీకే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది.

ఇక ఈ జాబితాలో కోల్‌కతాలోని చౌరంఘీ అసెంబ్లీ నియోజకవర్గానికి దివంగత కాంగ్రెస్ నేత సొమెన్ మిత్రా భార్య శిఖా మిత్ర పేరును ప్రకటించారు. అయితే ఈ విషయమై శిఖా మిత్ర మండిపడ్డారు. తనను ఒక్క మాట కూడా అడగకుండా తన పేరును పార్టీ ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. తానూ ఎన్నికల్లో నిలబడడం లేదని, తనను సంప్రదించకుండానే తన పేరును పార్టీ ప్రకటించిందని తెలిపారు. అంతేకాకుండా తాను బీజేపీ లో చేరడం లేదని స్పష్టం చేసారు. దీంతో బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్నికల వేళ ఇలాంటి పరాభవం ఎదురవడంపై ప్రతిపక్షాలు బీజేపీ పై విమర్శలు గుప్పిస్తున్నాయి.

Advertisement

Next Story