వాట్సాప్ ఫీచర్స్ కాపీ కొట్టేస్టున్న‘సిగ్నల్’

by Harish |
వాట్సాప్ ఫీచర్స్ కాపీ కొట్టేస్టున్న‘సిగ్నల్’
X

దిశ, వెబ్‌డెస్క్‌: వాట్సాప్ ప్రైవసీ పాలసీ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రకటించడంతో, ఎంతోమంది యూజర్లు తమ డేటా భద్రతకు అనుకూలంగా ఉండే ‘సిగ్నల్’ ‘టెలిగ్రామ్’ వంటి యాప్స్‌‌కు మూవ్ అయిన విషయం తెలిసిందే. యూజర్ల విమర్శలతో పాటు వారిని కోల్పోవడంతో ఆలస్యంగా తమ తప్పు తెలుసుకున్న వాట్సాప్ తమ ప్రైవసీ విధానాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, తమ వినియోగదారులందరికీ మెసేజ్‌లు కూడా పంపించింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోగా, వాట్సాప్ ఆ ప్రకటన చేసినా కస్టమర్ మైగ్రేషన్ ఆగలేదు. తమకు అనుకూలంగా మారిన ఈ పరిస్థితిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ‘సిగ్నల్’ భావించింది. అందుకే వాట్సాప్‌లోని చాలా ఫీచర్స్‌ను కాపీ కొట్టేసింది. కస్టమర్స్‌ని ఎంగేజ్ చేయడం కోసం మరిన్ని కొత్త అప్‌డేట్స్ తీసుకువస్తోంది.

చాట్ వాల్‌పేపర్:

సిగ్నల్ ఇటీవల ‘చాట్ వాల్‌పేపర్’ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం ఇతరులతో చాట్ చేసేటప్పుడు ప్రతి చాట్‌ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ ఇదివరకే వాట్సాప్‌లో ఉంది.

స్టేటస్ అప్డేట్‌:

వాట్సాప్ మాదిరి..సిగ్నల్ యూజర్లు ఇకపై తమ స్టేటస్ అప్‌డేట్ చేసుకోవచ్చు. సిగ్నల్ కొత్త బీటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్ తీసుకొచ్చింది.

యానిమేటెడ్ స్టిక్కర్స్:

వాట్సాప్ తమ కస్టమర్ల కోసం గతేడాది ‘యానిమేటెడ్ స్టిక్కర్స్’ తీసుకొచ్చిన సంగతి తెలసిందే. సేమ్ అదే ఫీచర్‌ను ‘సిగ్నల్’ తాజాగా అప్‌డేట్ చేసింది. సిగ్నల్ డెస్క్‌టాప్ యాప్ నుంచి యానిమేటెడ్ స్టిక్కర్‌లను క్రియేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వీటిని స్నేహితులతో పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.

గ్రూప్ కాల్స్ అండ్ ఇన్వైట్ లింక్:

సిగ్నల్‌లో ఇంతకుముందు గ్రూప్ కాల్ ఫీచర్ ఉండేది. కానీ, అందులో కేవలం ఐదుగురు వరకే మాట్లాడే అవకాశం ఉండగా, లేటెస్ట్‌గా ఆ లిమిట్‌ను ఎనిమిదికి పెంచింది. వాట్సాప్‌ గ్రూప్ కాల్‌లో ఒకేసారి 8 మంది మాట్లాడొచ్చు. అంతేకాదు గ్రూప్‌‌లో ఒకరిని ఇన్వైట్ చేసేందుకు ఉపయోగించే ‘షేరబుల్ గ్రూప్ ఇన్వైట్ లింక్’ ఫీచర్‌ను కూడా సిగ్నల్..వాట్సాప్ నుంచి కాపీ కొట్టింది.

‘మేము ఏ యూజర్ డేటాను సేకరించం. భారత్‌ సహా ప్రపంచ కస్టమర్లందరూ మా యాప్‌ను నమ్ముతున్నారు. అందుకు మా యాప్‌ డౌన్‌లోడ్స్ నిదర్శనం కాగా, సిగ్నల్ వినియోగదారులందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. వారికోసం మరింత కష్టపడుతూ, మంచి ఫీచర్లను అందిస్తాం’ అని సిగ్నల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రయాన్ యాక్టన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed