సిద్ధార్థ్‌ను చంపేస్తాం : తమిళనాడు బీజేపీ నాయకులు

by Anukaran |
Sidharth
X

దిశ, సినిమా: బీజేపీ ప్రభుత్వం కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టడంలో ఫెయిల్ అయిందని, ఈ విషయంలో ఇప్పటికి కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతోందని హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రజలకు కనీస వైద్యసదుపాయాలు అందుబాటులో ఉంచని ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? అని తనదైన స్టైల్‌లో విమర్శించాడు. ముందుచూపులేని మోడీ పాలన వల్ల దేశం మొత్తం కరోనాతో బాధపడుతోందని, ఇక రిజైన్ చేసి టీస్టాల్ పెట్టుకోవడమే మంచిదని సూచించాడు. అటు ఆక్సిజన్ కొరత గురించి మాట్లాడితే శిక్ష తప్పదన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సైతం వదల్లేదు సిద్ధార్థ్.

దీంతో తమిళనాడు బీజేపీ నాయకులు సిద్ధును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సెల్ నెంబర్ లీక్ చేశారని, తను మళ్లీ నోరు తెరవకుండా టార్చర్ చేయాలని పలువురికి ఫోన్ నంబర్ ఇచ్చారని ఆరోపించిన సిద్ధార్థ్.. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశాడు. తనకు దాదాపు 500 ఫోన్ కాల్స్ వచ్చాయని, తనను తన ఫ్యామిలీని చంపేస్తామని బెదిరిస్తూ దారుణంగా తిట్టారని తెలిపాడు. ఈ కాల్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్లు వెల్లడించాడు. కాగా ఎన్ని ప్రయత్నాలు చేసిన తన నోరు మూయించలేరన్న సిద్ధు.. మీ ట్రయల్స్ మీరు చేసుకోవచ్చంటూ మోడీ, అమిత్ షాలను ట్యాగ్ చేయడం గమనార్హం.

Advertisement

Next Story