- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ వాడకంతో కొత్త సమస్యలు!
పెల్ట్జ్‌మెన్ ప్రభావం అని ఒకటుంటుంది. ఉదాహరణకు కారులో సీట్ బెల్ట్ సంగతే తీసుకున్నట్టయితే, సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ముందు 90 స్పీడులో వెళ్లే డ్రైవర్.. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత అది ఉందన్న ధైర్యంతో 140 స్పీడులో వెళ్తాడు. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘పెల్ట్జ్‌మెన్ ప్రభావం’ అంటారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో పెట్టిన కఠినమైన లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో ప్రజల ధోరణిలో ఈ పెల్ట్జ్‌మెన్ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా మాస్కులు ధరించే విషయంలో ఇది విపరీతంగా కనిపిస్తోంది. అయితే కరోనా కేసులు పెరగడానికి ఇది కూడా ఒక పరోక్ష కారణం.
సడలింపులు ఇచ్చిన తర్వాత అందరూ మాస్కులు పెట్టుకుని బయటికి వస్తున్నారు. అయితే మాస్కులు పెట్టుకున్నామన్న ధైర్యంతో సామాజిక దూరం, చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడటం వంటి పనులు చేయడం లేదు. అదీగాక మాస్కు ఉందనే ధైర్యంతో ఇంకాస్త ఎక్కువ తిరగడం వల్ల వైరస్ చాప కింద నీరులా ప్రయాణిస్తోంది. ఇక ఎలాగూ రోజువారీ పనుల్లో పడిపోయారు కాబట్టి aమాస్కు ధరించడం కూడా కొంతమంది పూర్తిగా మానేశారు. మాస్కు కేవలం ఒక చిన్నస్థాయి నివారణ చర్య మాత్రమే అని జనాలు గుర్తుపెట్టుకోవాలి.
చేతులతో ముఖాన్ని కళ్లను తాకొద్దని, అలా తాకడం వల్ల కరోనా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతూనే ఉన్నారు. కానీ మాస్కు పెట్టుకోవడం వల్ల కలిగే దురద కారణంగా సగటు కంటే ఎక్కువసార్లు ముఖాన్ని ముట్టుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. దీంతో దురద కలుగుతోందన్న సాకును చూపించి మాస్కుని ధరించకుండా జనాలు వంకలు చెబుతున్నారు. ఇక డిస్పోజబుల్ మాస్కుల వాడకం పెరగడంతో మరో కొత్త సమస్య తెరమీదికి వస్తోంది. ఇప్పుడు ఏ ఆస్పత్రి చెత్తలో చూసినా, ఏ అపార్టుమెంట్ గార్బేజీలో చూసినా వాడిపారేసిన మాస్కులు కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మాస్కుల చెత్తపెరిగి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రకృతిప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న సమస్యను పరిష్కరించాలని చూస్తే, ఆ సమస్య తీరకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తుండటం ఒకింత కంగారుపెట్టే పరిస్థితిని కల్పిస్తున్నాయి.