మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన సిద్దిపేట జిల్లా బీజేపీ చీఫ్.. విషయమేంటంటే.?

by Shyam |
మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన సిద్దిపేట జిల్లా బీజేపీ చీఫ్.. విషయమేంటంటే.?
X

దిశ, సిద్దిపేట : ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మంగళవారం బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో కిషన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు.

ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాలోని వీర భైరన్ పల్లిని, కొమరవెల్లి మల్లన్న క్షేత్రాన్ని, వర్గల్ సరస్వతీ మాత క్షేత్రాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దాలని విజ్ఞప్తి చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.

Advertisement

Next Story