కొత్త ప్రపంచానికి ‘శృతి’ సరికొత్త ప్రణాళిక

by Shyam |
కొత్త ప్రపంచానికి ‘శృతి’ సరికొత్త ప్రణాళిక
X

‘లాక్‌డౌన్ మనిషిని మనిషిలా తయారు చేసింది. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని బయటకు తెచ్చింది. మనిషిలో దాగున్న ప్రతిభను బయటకు తీయగలిగింది. ఆ ప్రతిభకు మెరుగులు దిద్దే సమయాన్ని ప్రసాదించింది. మనవారెవరో.. పరాయులెవరో చూపెట్టగలిగింది. ఒంటరిగా బతకగలం అనే ధైర్యాన్ని నూరిపోసింది’ ఇక ఇన్ని అనుభవాలతో కొత్త లైఫ్‌ను స్టార్ట్ చేసే సమయం వచ్చేసిందని అంటోంది.. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్.

https://www.instagram.com/p/CAnXqgMh0tv/?utm_source=ig_web_copy_link

లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే దాదాపు రెండు నెలలకుపైగా ఒకే ఇంట్లో ఒంటరిగా గడిపిన శృతి.. ఈ లాక్‌డౌన్ అనుభవం గొప్ప స్ఫూర్తినిచ్చిందని చెబుతోంది. పెట్ క్యాట్ క్లారా, పియానాతో ఇన్ని రోజులు సహవాసం చేసిన ఈ మల్టీ టాలెంటెడ్ భామ.. వాటితో గడిపిన సమయం చాలా నచ్చిందని చెప్తోంది. కానీ, లాక్‌డౌన్ కొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో నిజంగా ఓ ప్లానింగ్ అవసరమని అంటోంది. ‘ఒకరికొకరు ఎలా సహాయపడాలి ? ఇతరుల పట్ల ఎలా బాధ్యతగా ఉండాలి? పనిలో మన భద్రతను ఎలా నిర్ధారించుకోవాలి? ఇన్ని ప్రశ్నలతో లైఫ్‌ను రీస్టార్ట్ చేయాల్సిన అవసరముంది. అది కూడా సురక్షితంగా, ఉత్తమంగా ఉండాలి’ అని సెలవిస్తోంది. ఇది ప్రతి ఒక్కరికీ కష్ట సమయమే.. కరుణ, దయ కలిగి తిరిగి ప్రపంచంలోకి వెళ్లాలని, తద్వారా ఈ కష్ట కాలాన్ని కలిసికట్టుగా ఎదిరించాలని సూచిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed