- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీయ భర్తకు కరోనా లక్షణాలు
అందాల తార శ్రీయ స్పెయిన్ క్రీడాకారుడు ఆండ్రీని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. వివాహం తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతున్న శ్రీయ… కరోనా కారణంగా ప్రస్తుతం లాక్ డౌన్ టైమ్ ను భర్తతోనే స్పెయిన్ లో గడుపుతోంది. ఇన్నాళ్లు ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీయ…ఇప్పుడు ఆవేదనతో కూడిన విషయాన్ని షేర్ చేసింది. తన భర్తకు కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిపింది. దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని… దీంతో హాస్పిటల్ కి వెళ్లి వైద్యులను కలిశామని తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని… హాస్పిటల్ కన్నా ఇంట్లోనే ఉండడం మంచిదని డాక్టర్లు సూచించారని తెలిపింది. దీంతో ఇంట్లోనే ఇద్దరం వేరు వేరు గదుల్లో ఉంటున్నామని… సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించింది. స్పెయిన్ లో కూడా కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగానే ఉందని… ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు కుటుంబంలో ఒక్కరికే అనుమతి ఇస్తున్నారని చెప్పింది. మార్చి 13 మా పెళ్లిరోజున రెస్టారెంట్ వెళ్లాలి అనుకున్నా… ఆ చాన్స్ లేదని.. అధికారులు అనుమతించలేదని చెప్పింది. మీరు కూడా పరిస్థితులు అర్ధం చేసుకుని మెలగాలి అని… ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించింది శ్రీయ.
Tags: Shriya Sharan, Tollywood, CoronaVirus, Corona, Covid19