శ్రేయస్ అయ్యర్ సర్జరీ సక్సెస్

by Shiva |
శ్రేయస్ అయ్యర్ సర్జరీ సక్సెస్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్‌‌కు వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. అతడి భుజం డిస్ లొకేట్ అయినట్లు ఎక్స్‌రేలో గుర్తించిన వైద్యులు ఆ మేరకు చికిత్సను నిర్వహించారు. అతడు కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం అతడిని సాధారణ వార్డుకు తరలించారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసిన అయ్యర్ తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపాడు. ‘నాకు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతం అయ్యింది. ప్రస్తుతం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా. త్వరలోనే అందరి ముందుకు వస్తాను. మీరు చూపిన ప్రేమకు నా కృతజ్ఞతలు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 14వ సీజన్‌కు పూర్తిగా దూరమయిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story