- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరుద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఈ ఏడాది నోటిఫికేషన్లు కష్టమే!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగడం లేదు. ఈ ప్రక్రియ గతేడాది డిసెంబర్నుంచి ఊరిస్తూనే ఉంది. రాష్ట్రంలో 50 వేల కొలువులు భర్తీ చేస్తామని గతేడాది డిసెంబర్13న సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంత వరకూ ఖాళీల అంశంపైనే క్లారిటీ రాలేదు. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనే వివరాల సేకరణపై ఇంకా సాగదీస్తూనే ఉన్నారు. ఈ ఏడాదిలో ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని ఆశతో ఉన్న నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం పలు సమస్యలు ముందుండటంతో నోటిఫికేషన్లు విడుదల కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జోన్లలో సర్దుబాటుకు ఐఏఎస్‌లతో కమిటీ..?
రాష్ట్రంలో కొత్త జోన్లు, మల్టీజోన్లు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను జోన్ల వారీగా సర్దుబాటు చేయాల్సి ఉంది. దీనికోసం సంబంధిత ఉద్యోగులకు అఫ్షన్లు ఇచ్చి, ఉద్యోగుల వివరాలన్నీ సేకరించాల్సి ఉంటోంది. ఉద్యోగి స్వస్థలం, పాత జిల్లా ప్రకారం ఎక్కడ స్థానికత అనే వివరాలన్నీ తీసుకుని, జోన్ల వారీగా కేటాయించాల్సి ఉంటోంది. వీటి కోసం ఐఏఎస్‌లతో కమిటీ వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగుల వివరాలను ఐఏఎస్‌ల కమిటీ తీసుకున్న అనంతరం ఆఫ్షన్లు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ ప్రక్రియ కనీసం నాలుగైదు నెలలు తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో పీఆర్సీ నివేదికలపై అధ్యయనానికే రెండు నెలల సమయం తీసుకున్న ఐఏఎస్‌ల బృందం.. ఈ ప్రక్రియను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాదే నోటిఫికేషన్లు..?
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఇప్పటికీ తేల్చడం లేదు. ముందుగా కేసీఆర్ 50 వేల కొలువులపై ప్రకటన చేసినా.. అసలు ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గత నెల 14న నిర్వహించిన రాష్ట్ర కేబినెట్‌కు 56 వేల ఖాళీలున్నాయని నివేదించారు. కానీ దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని కేబినెట్ ఐదురోజుల గడువు ఇచ్చి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కానీ, ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదు. దీంతో పాటుగా ప్రస్తుత ఉద్యోగుల జోన్ల సర్దుబాటును తేల్చాల్సి ఉంటోంది. ఈ ప్రక్రియ పూర్తి అయితేనే ఉద్యోగాల భర్తీపై క్లారిటీ రానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ పూర్తి కావాలంటూ నాలుగైదు నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది నోటిఫికేషన్లు రానట్టేనని భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ ఏడాది ఎదురుచూపుల్లోనే గడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2014 వరకు టీఎస్పీఎస్సీలో నమోదైన నిరుద్యోగులు 15 లక్షలు ఉండగా.. వారిలో సగం మంది ఏజ్‌బార్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏజ్ అంశంలో ప్రభుత్వం ఇచ్చిన సడలింపు జీవో గడువు కూడా గత నెలలో ముగిసిపోయింది. దీనిపై ప్రభుత్వం మళ్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పదోన్నతులపై అదే కథ
మరోవైపు ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల అంశం కూడా ఇంకా తేలడం లేదు. ఇటీవల సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల్లో సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సచివాలయంలో పదోన్నతులకు బ్రేక్ పడింది. ఇలా చాలా శాఖల్లో పదోన్నతులను తేల్చాల్సి ఉంది. ఈ పదోన్నతులు పూర్తి చేస్తే మరిన్ని ఖాళీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పట్లో దీనిపై క్లారిటీ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది కూడా నిరుద్యోగులకు శాపంగా మారుతోంది.