- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ న్యూస్.. ఆ ఉద్యోగులకు సర్కార్ బెనిఫిట్స్ నిల్..!
దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ.. తెలంగాణ గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రం వర్తించడం లేదు. దీంతో అసలు తమకు పదవీ విరమణ వయస్సు పెంపు వర్తిస్తుందా ? లేదా అనేది తెలియకుండా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది పదవీ విరమణ సైతం చేశారు. మరికొంత మంది జూలై, ఆగస్టు నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు.
ఆగమ్య గోచరంగా 513 మంది ఉద్యోగుల పరిస్థితి..
తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో 513 మంది ఉద్యోగులు వివిధ హోదాలలో పని చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలతో ఇందులో పని చేస్తున్న ఏఈ, డీఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్ తదితర స్థాయి ఉద్యోగులను జలమండలి, జీహెచ్ఎంసీ, దేవాదాయశాఖ, బేవరేజెస్, టూరిజం తదితర ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. దీంతో నాటి నుండి సంస్థ ఉద్యోగులంతా డిప్యుటేషన్ పద్ధతిలో ఆయా కార్యాలయాలలో విధులు నిర్వహిస్తున్నారు.
అయితే గత ఏప్రిల్ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. తెలంగాణ గృహ నిర్మాణ సంస్థకు చెందిన ఉద్యోగులకు మాత్రం వయోపరిమితి పెంపు ఇంకా వర్తించకపోవడంతో పదవీ విరమణకు సమీపంలో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు .
జూన్‌లో 42 మంది..
విరమణ వయస్సు పెంపు అమలు కాకపోవడంతో జూన్ నెలలో 42 మంది పదవీ విరమణ చేశారు. జూలై, ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో పదవీ విరమణ చేయాల్సిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సూచనలు అందకపోవడంతో పదవీ విరమణ తప్పని పరిస్థితులలో వారు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు వయో పరిమితిని ఎందుకు పెంచరని ప్రశ్నిస్తున్నారు.
పదవీ విరమణ చేసిన వారికి వేతనాలు, బెన్‌ఫిట్స్ లేవు..
గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తూ పదవీ విరమణ చేసిన వారికి ఇప్పటి వరకు ఎలాంటి బెన్‌ఫిట్స్ అందలేదు. వేతనాలు కూడా రావడం లేదు. ఇదే విషయంపై సంస్థ ఎండీ, ఐఏఎస్ అధికారి సునీల్ శర్మను ఉద్యోగులు న్యాయం చేయాలని కోరగా.. త్వరలో పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ ఎలాంటి పురోగతి కన్పించడం లేదు. దీంతో పదవీ విరమణ చేసిన వారితో పాటు చేయాల్సిన వారు ఆందోళన చెందుతున్నారు. తమకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 61 ఏండ్లకు వయో పరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.