- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీ తాగేవారికి షాకింగ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్ : మద్యం తాగనివాళ్లు ఉంటారేమో కానీ టీ తాగని వాళ్లు మాత్రం ఉండరు. టీలో మత్తు గమ్మత్తే వేరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెదడు తక్షణ విశ్రాంతి పొందడం కోసం చాలా మంది టీ సేవిస్తారు. దానిని తాగిన వెంటనే ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా ఉంటాము. దీనినే అదునుగా తీసుకున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్ మార్కెట్‌ను టార్గెట్ చేసి కల్తీగాళ్లు నగరంలో నయా దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తక్కువ రేటు.. ఎక్కువ రుచితో ఫేక్ టీ పౌడర్‌ను మార్కెట్లోకి దించారు. అయితే ఇది చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. కలర్‌ఫుల్‌గా కనిపించే గరం గరం ఛాయ్‌లో విష రసాయనాలు కలిశాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకుని కల్తీగాళ్లు యథేచ్ఛగా ఈ దందా సాగిస్తున్నారు. ఆరోగ్యాన్ని కల్తీ చేసే నకిలీ టీ పౌడర్ మార్కెట్‌లో డెడ్‌చీప్‌గా దొరుకుతుంది. ధర తక్కువ రుచి ఎక్కువ అని కమిట్ అయితే అంతే సంగతులని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫేక్ మాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు. తక్కువ ధరలకు మొగ్గు చూపకుండా నాణ్యమైన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫేక్ పదార్థాలపై అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలంటున్నారు. డైలీ తాగే చాయ్‌లో విచ్చలవిడిగా సింథటిక్ కెమికల్స్ కలుపుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ అడ్డగోలు దందా రీసెంట్‌గా బయటపడింది కానీ మార్కెట్‌ను ఎప్పుడో ముంచెత్తిందని పేర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో 46 క్వింటాళ్ల నకిలీ టీ పొడిని పోలీసులు సీజ్ చేశారు. ఇందులో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్టు తెలుస్తోంది.