- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ కు షాక్… 400 మంది ఆపార్టీలోకి జంప్…!
దిశ, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ ఎన్నికల రణభేరీని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మామిళ్ళగూడెం సభ సాక్షిగా మోగించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 400 కుటుంబాలను కండువాకప్పి ఆయన స్వాగతం పలికారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద విమర్శల నిప్పులు కురిపించారు. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితికి ఖమ్మం పట్టణంలో ఎవరూ ఊహించని విధంగా భారీ షాక్ తగిలింది. సుమారు 400 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు లింగం నరేందర్ ఆధ్వర్యంలో ఆ పార్టీని వీడి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మామిళ్లగూడెం సభలో సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. ఖమ్మం పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సమస్యల పక్కన పెట్టి.. కేవలం అధికారం, డబ్బు, మద్యం, అహంభావం పెట్టుకుని ఖమ్మం పురపాలక ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అగ్రహంగా చెప్పారు.