- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు
దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో పలు గ్రామాలను విలీనం చేస్తూ.. వాటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్, చట్టసవరణపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు 3 వారాల పాటు స్టే విధించింది. ఆర్డినెన్స్, చట్ట సవరణపై దాఖలైన అన్ని పిటిషన్లను విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. మూడు వారాల్లో తుది విచారణ పూర్తి చేస్తామని.. అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించొద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా, గ్రామాలను కార్పొరేషన్, పురపాలక సంఘాల్లో విలీనం చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్, చట్టసవరణను సవాల్ చేస్తూ హైకోర్టులో 46మంది పిటిషన్లు దాఖలు చేశారు. నగర పాలక సంస్థల్లో విలీనం చేయడం వల్ల పన్నులు పెరగడం మినహా ఒరిగేదేమీ లేదని పిటిషన్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికల నిర్వహణపై మూడు వారాలపాటు స్టే విధించింది.