మేకల కాపరిని వదలని కామాంధుడు.. అలా కనిపించడంతో..!

by Anukaran |
మేకల కాపరిని వదలని కామాంధుడు.. అలా కనిపించడంతో..!
X

దిశ, అచ్చంపేట: మేకలను కాస్తున్న మహిళా కాపరిపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఒంటరిగా ఉందని అదును చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట సీఐ అనుదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బుడ్డతండాకు చెందిన ఓ మహిళకు.. ఇదే మండలంలోని దేవదారికుంట తండాకు చెందిన వ్యక్తితో 10 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. భర్త గతేడాది క్రితం అకాల మరణం చెందాడు. భర్త మరణం తర్వాత ఉప్పునుంతల మండలం సూర్య తండాకు చెందిన మహేష్ అనే వ్యక్తి సదరు మహిళను వేధించడం మొదలుపెట్టాడు. లైంగిక కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో స్వగ్రామమైన బుడ్డ తండాకు వచ్చేసిన బాధితురాలు.. ఈ నెల 6వ తేదీన ఆదిపూర్ శివారులో మేకలను తీసుకొని ఒంటరిగా మేత కోసం వెళ్లింది. ఇది తెలుసుకున్న మహేష్ ఆమె వద్దకు వెళ్లి బలవంతం పెట్టి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సీఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed