- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శేఖర్ మాస్టర్ ప్లాస్మా దానం..!
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి ప్లాస్మా దానం ప్రాధాన్యతను సంతరించుకుంది. కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కరోనా చికిత్సలో కీలకంగా మారిన ప్లాస్మా దానంపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కరోనాను జయించి ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు.
గత నెలలో తనకు కరోనా పాజిటివ్ రాగా, కిమ్స్‌లో చికిత్స తీసుకున్నట్లు శేఖర్ మాస్టర్ వెల్లడించారు. ఇప్పుడు తన శరీరంలో యాంటీ బాడీస్ పెరిగనందున ప్లాస్మాను చేశానని అన్నారు. డాక్టర్ల సమక్షంలో 400 మి.లీ ప్లాస్మాను దానం చేసినట్లు తెలిపారు. తాను దానం చేసిన ప్లాస్మా ద్వారా ఇద్దరు నుంచి ముగ్గురు రక్షించబడతారని స్పష్టం చేశారు.