- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శర్వాకు చెర్రీ బర్త్‌డే సర్‌ప్రైజ్.. అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్!
దిశ, సినిమా : యంగ్ హీరో శర్వానంద్ పుట్టినరోజు పురస్కరించుకుని తన బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మిడ్ నైట్ కేక్ కట్ చేయించిన చెర్రీ.. అదిరిపోయే గిఫ్ట్ కూడా ఇచ్చాడట. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. గ్రేట్ పార్టీ హోస్ట్ చేసినందుకు చెర్రీకి ట్విట్టర్ వేదికగా థాంక్స్ చెప్పాడు శర్వా. ఇదే క్రమంలో తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ నుంచి ఆయా మూవీ మేకర్స్ అప్‌డేట్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం శర్వానంద్ ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘మహాసముద్రం’ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. తనకు విష్ చేస్తూ మూవీయూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. కుడిచేతిపై త్రిశూలం టాటూ, వెపన్‌తో ఉన్న శర్వా టెర్రిఫిక్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా కాగా.. తన నుంచి ఇలాంటి ఊరమాస్ క్యారెక్టరే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. సిద్ధార్థ్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయల్ కథానాయికలు.
మరోవైపు శర్వానంద్, రష్మిక మందన జంటగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నుంచి కూడా అప్‌డేట్ రావడం విశేషం. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాను తిరుమల కిశోర్ డైరెక్ట్ చేస్తుండగా.. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు.