- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిల టార్గెట్ కేసీఆర్.. తీవ్ర విమర్శలు
దిశ వెబ్‌డెస్క్: త్వరలో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న వైఎస్ షర్మిల.. మరింత స్పీడును పెంచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై డైరెక్ట్‌గా గురిపెట్టారు. మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్‌పాండ్‌లో షర్మిల ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె. కేసీఆర్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.
ప్రస్తుతం తెలంగాణలో స్త్రీల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉందని, కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని షర్మిల ఆరోపించారు. మహిళలకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎందరో మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారని, కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మాత్రమే మంత్రులుగా అవకాశం ఇచ్చారన్నారు.
మహిళల కోసం తాను నిలబడతానని, తాను చేయబోయే ప్రతి పనిలో మహిళలకు తిగిన ప్రాతినిథ్యం కల్పిస్తాని షర్మిల తెలిపారు. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని, ఇక్కడ మహిళలు ఎవరికీ తక్కువ కాదని షర్మిల చెప్పారు.