ఇవాళ ఎన్ని విమానాలు వచ్చి వెళ్లాయంటే.. !

by Shyam |
ఇవాళ ఎన్ని విమానాలు వచ్చి వెళ్లాయంటే.. !
X

దిశ, న్యూస్‌బ్యూరో: శంషాబాద్ విమానాశ్రయానికి మంగళవారం 19 అరైవల్, 20డిపార్చర్ విమానాలు వచ్చి వెళ్లాయి. 2,500 మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ఇండిగోకు చెందిన 6732 విమానం ఈ రోజు బయలుదేరి వెళ్లిన మొదటి విమానం. ఇది ఉదయం 4.46 గంటలకు 45మంది ప్రయాణికులతో లక్నోకు వెళ్లింది. ఇండిగోకు చెందిన 6ఇ 587 హైదరాబాద్‌కు వచ్చిన మొదటి విమానం. రాత్రి 01.01 గంటల సమయంలో పుణె నుంచి 108 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వచ్చింది. విమానాశ్రయంలో భద్రతా నియమాలకు వచ్చిపోయే ప్రయాణీకులు ఇద్దరినీ థర్మల్ స్కానర్ల ద్వారా స్కాన్ చేశారు. భౌతికదూరం నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ప్రయాణికుడి థర్మల్ స్ర్కీనింగ్, అనేక చోట్ల ఆటోమాటిక్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్లు, నేలపై భౌతిక దూరపు గుర్తులు, దూరంగా సీటింగ్ ఏర్పాట్లు, నిబంధనలు అమలయ్యేలా ఎంట్రీ గేట్లు, బస్సింగ్ గేట్లను ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story