- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రద్ధాకపూర్.. బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు: తండ్రి
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్, ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టను పెళ్లి చేసుకోబోతోందని బీటౌన్ టాక్. ఈ మధ్య కొత్త పెళ్లి కొడుకు వరుణ్ ధావణ్ కూడా దీనిపై సోషల్ మీడియాలో చిన్న హింట్ ఇచ్చాడు. కాగా, ఈ విషయం గురించి ఓ మీడియా చానల్ శ్రద్ధ తండ్రి శక్తికపూర్‌ను అడగ్గా.. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త గురించి తనకు అసలు తెలియదన్నాడు. అయినా శ్రద్ధ ఏ డెసిషన్ తీసుకున్నా తనకు తోడుగా నిలబడతానని ప్రామిస్ చేశాడు. తను లైఫ్‌లో తీసుకున్న ప్రతి నిర్ణయానికీ సపోర్ట్ చేస్తానన్న శక్తి కపూర్.. రోహన్ శ్రేష్ట ఏంటి? శ్రద్ధ లైఫ్ పార్ట్‌నర్‌గా ఎవరిని ఎంచుకున్నా ఆబ్జెక్ట్ చేయనని చెప్పాడు.
రోహన్ మంచి అబ్బాయి అని.. చిన్నప్పటి నుంచి ఇంటికి వస్తాడని తెలిపిన నటుడు.. రోహన్, శ్రద్ధ సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలియదన్నాడు. ఒకవేళ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నా తనకు మాత్రం ఎప్పుడూ చిన్నప్పటి స్నేహితులుగానే కనిపిస్తారని పేర్కొన్నాడు. శ్రద్ధ ఈ విషయం గురించి తనతో ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశాడు.