- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక బ్రేకుల్లేవ్.. దూసుకుపోవడమేనంటున్న షారుఖ్
దిశ, వెబ్‌డెస్క్: ‘బాలీవుడ్ కా బాద్ షా’ షారుఖ్ ఖాన్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసి దాదాపు 3 ఏళ్లు అవుతోంది. 2018లో వచ్చిన జీరో సినిమా తర్వాత షారుఖ్ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. అయితే గతేడాది సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పథాన్’ సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే అట్లీ దర్శకత్వంలో మరో సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. అయితే షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో జైల్లో పడటంతో షారుఖ్ సినిమాలకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఆర్యన్ అక్టోబర్ నెలలో బయటకు వచ్చాడు.
ఇటీవల కేసుకు సంబంధించిన అన్ని లీగల్ పనులు పూర్తయ్యాయి. దీంతో ఫ్రీ అయిన షారుఖ్ మళ్లీ తన సినిమాలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే మళ్లీ జిమ్‌కు వెళ్లి బాడీ పెంచుతున్నాడు. అంతా సెట్ అయ్యాక ముందుగా సిద్ధార్థ్ ఆనంద్ ‘పథాన్’ సినిమాను పూర్తి చేయనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అందుకే ఈ సినిమాను పూర్తి చేసుకున్న తర్వాత అట్లీ సినిమాను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దీంతో షారుక్‌కు ఇక బ్రేకుల్లేవ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.