- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదవశాత్తు ఆర్టీసీ కండక్టర్ మృతి
by Kalyani |
X
దిశ, ఎల్కతుర్తి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఆర్టీసీ కండక్టర్ మృతి చెందిన సంఘటన మండలంలోని గోపాలపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గడ్డం సంపత్( 45) జగిత్యాల ఆర్టీసీ డిపో నందు కండక్టర్ గా పనిచేస్తున్నారు. పది నెలల కిందట ఉద్యోగరీత్యా విధుల్లో అలసత్వం వహించినందుకు సస్పెండ్ అయ్యి ఇంటి వద్దనే ఉంటున్నాడు. గ్రామ పెద్ద చెరువులో స్మశాన వాటిక వద్ద చేపలు పట్టేందుకు వెళ్లి సాయంత్రం వరకు కూడా తిరిగి ఇంటికి రాకపోయేసరికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదని తెలిపారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా చెరువు వద్దకు వచ్చి చూడగా సెల్ ఫోన్ దొరికిందని, నీటిలో వెతకగా మృతదేహం బయటపడిందని పేర్కొన్నారు. తన భర్త మృతి పై ఎలాంటి అనుమానం లేదని అతని భార్య వరలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Advertisement
Next Story