- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్తులన్నీ అమ్ముకున్న నటి.. ఆ బిల్లు చెల్లించేందుకేనా..?
దిశ, సినిమా: ప్రముఖ నటి షగుఫ్తా అలీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతోంది. దాదాపు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న తను మెడికల్ బిల్స్ చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. 17ఏళ్ల వయసు నుంచి యాక్టింగ్ కెరియర్ స్టార్ట్‌చేసిన షగుఫ్తా.. ప్రస్తుతం 54ఏళ్ల వయసులో ఇలాంటి దుర్భరస్థితిలో ఉండటంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనంతటికి కారణం నాలుగేళ్లుగా తనకు వర్క్ లభించకపోవడమే అని చెప్తోంది నటి. డయాబెటిస్‌తో బాధపడుతున్న తను కుటుంబ బాగోగులు కూడా చూసుకోవాలని, ఆర్థిక ఇబ్బందులతో కారు, నగలు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపింది. డాక్టర్ దగ్గరికి వెళ్లేందుకు కూడా ఆటోరిక్షాలోనే ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సిట్యుయేషన్ చాలా హర్టింగ్‌గా ఉందని, ఫైనాన్షియల్ హెల్ప్ అవసరమన్న ఆమె.. ఈ టైమ్‌లో వర్క్ లభించడం ఇంపార్టెంట్ అని తెలిపింది. ఈ కష్టసమయంలో ఆదుకుంటాడనే ఉద్దేశంతో సోనూ సూద్‌ను కాంటాక్ట్ చేశానని చెప్పింది.