- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మహిళా క్రికెట్‌లో షెఫాలీ వర్మ రికార్టు
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా యువ క్రికెటర్ షెఫాలీ వర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. ఆదివారం ఇంగ్లాండ్ మహిళా జట్టు ఇండియా మహిళలతో తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్ తుది జట్టులో షెఫాలీ వర్మ చోటు దక్కించుకున్నది. ఇది షెఫాలీకి తొలి వన్డే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన ఏకైక టెస్టులో షెఫాలీ వర్మ అరంగేట్రం చేసింది. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన షెఫాలీ డ్రా కావడంలో తన పాత్ర పోషించింది. అప్పటికే టీ20 జట్టులో రెగ్యులర్ బ్యాటర్‌గా ఉన్నది. మొత్తం మూడు ఫార్మాట్లలో కేవలం 17 ఏళ్లం 150 రోజుల్లో అరంగేట్రం చేసింది. భారత మహిళా క్రికెట్‌లో అత్యంత పిన్నవయసులో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన రికార్డును షెఫాలీ వర్మ లిఖించుకున్నది.
కేవలం మహిళా క్రికెట్‌లోనే కాకుండా పురుషుల క్రికెట్‌లో కూడా అన్ని ఫార్మాట్లలో చిన్న వయసులో అరంగేట్రం చేసిన రికార్డు షెఫాలీనే దక్కించుకున్నది. అంతకు మునుపు ఆప్గానిస్తాన్ క్రికెటర్ ముజీబుర్ రెహ్మాన్ 17 ఏళ్ల 78 రోజులకు మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత శారా టేలర్ (17 ఏళ్ల 86 రోజులు), ఎలిస్ పెర్రీ (17 ఏళ్ల 104 రోజులు), మహ్మద్అమిర్ (17 ఏళ్ల 108 రోజులు) అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లుగా రికార్డు సృష్టించారు.