ఛీ.. వీళ్లు మనుషులేనా.. వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి అలా చేస్తారా ?

by Sumithra |   ( Updated:2021-10-12 00:06:50.0  )
rape
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి నీచంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం మరిచి ఓ వివాహిత స్నానం చేస్తుంటే దొంగ చాటుగా వీడియో తీసి ఇద్దరు అన్నదమ్ములు ఆమెపై లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్లితే.. ఖమ్మం జిల్లాలోని ఖానాపుర్ పోలీస్టేషన్ పరిధిలో నివసించే ప్రవీణ్ రాజ్ అనే యువకుడు వారి పక్కింట్లో నివసించే వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో ఆమెకు చూపెట్టి రోజు వేధించడం మొదలు పెట్టాడు. వాటితో ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు. తర్వాత ఈ విషయం అతని తమ్ముడికి తెలిసి తాను కూడా బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై లైంగిక దాడి చేశారు. రోజు ఇలా అన్నదమ్ములు ఇద్దరూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై లైంగిక దాడి చేస్తుడడం, ఆ వేధింపులు తట్టుకోలేక వివాహత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అన్నదమ్ములిద్దరు వీడియోలు తీసి వేధిస్తున్నారని, తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed