బాలికపై లైంగిక దాడి

దిశ, వెబ్‌డెస్క్: బాలికపై బాలుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ఉధమ్‌సింగ్‌నగర్ జిల్లాలోని పంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు.. తమ ఇంటికి సమీపంలో నివసించే బాలికకు కొద్దిరోజుల క్రితం ప్రేమ పేరిట దగ్గరయ్యాడు. ఆతర్వాత బాలికపై లైంగిక దాడికి పాల్పడి.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక గతనెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి తల్లిదండ్రులకు అసలు విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని రెండ్రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement