టీ సిరీస్‌ ఎండీపై కేసు నమోదు.. ఉద్యోగం పేరుతో మహిళను మూడేళ్లుగా

by Sumithra |   ( Updated:2021-07-16 04:22:44.0  )
t- series md news
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ టీ సిరీస్‌ ఎండీ భూషణ్‌ కుమార్‌(43) పై కేసు నమోదు అయ్యింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్‌ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ముంబైలోని అంధేరీ డీఎన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. టీ సిరీస్‌ స్థాపకుడు, మధురగాయకుడైన గుల్షన్‌ కుమార్‌ పెద్ద కొడుకు అయిన భూషణ్‌ కుమార్‌ దువా, ప్రస్తుతం టీ సిరీస్‌కు చైర్మన్‌ కమ్‌ ఎండీగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 2017లో తన అప్‌కమింగ్‌ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి, తనపై అత్యాచారం చేశాడని, మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ ఆరోపణలపై భూషణ్‌ కుమార్‌ స్పందించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఆరోపణలు బాలీవుడ్ లో సంచలనం రేకెత్తిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ఈయన నటి దివ్యా ఖోస్లాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story